Homeజాతీయంపుల్వామా దాడిలో 23 ఏళ్ల యువతి హస్తం

పుల్వామా దాడిలో 23 ఏళ్ల యువతి హస్తం

పుల్వామా దాడిలో 23 ఏళ్ల యువతి హస్తం కూడా ఉందా? ఆమె తీవ్రవాదులకు సహకరించిందా? అంటే అవుననే అంటోంది జాతీయ దర్యాప్తు బృందం. ఇన్‌షా జాన్ (23) పుల్వామా దాడిలో ఉగ్రవాదులకు సహకరించిందంటూ ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. పుల్వామాకు ప్రధాన కుట్రదారు అయిన ఉగ్రవాది మహ్మద్ ఉమర్ ఫరూక్‌తో పాటు మరి కొందరు ఉగ్రవాదులతో ఆ యువతి సంబంధాలు నెరుపుతుండేదని ఎన్‌ఐఏ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. సామాజిక మాధ్యమాలు,ఫోన్ సంభాషణలు నిత్యం చేసేదని ఎన్‌ఐఏ ధ్రువీకరించింది.

‘‘ఆ యువతికి, తీవ్రవాదులకు మధ్య జరిగిన మెసేజ్‌లను మేం సేకరించాం. ఆ మెసేజ్‌లో చాలా సామ్యాలున్నట్లు కూడా మేం కనుగొన్నాం. ఇదే విషయాన్ని మా ఛార్జిషీట్‌లో పేర్కొన్నాం కూడా’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులతో నిత్యం సంబంధాలు నెరిపే విషయం ఆ యువతి తండ్రికి కూడా బాగా తెలుసని అధికారులు వెల్లడించారు.

ఇన్‌షా జాన్, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలు బలపడేట్లు ఆయన తండ్రి తారీఖ్ కూడా సహకరించేవారని తెలిసింది. వారికి అవసరమైన ఆహారం, నివాసాలు, ఆయుధాలు ఇలా అన్నింటినీ బాలిక తండ్రి సమకూర్చే వారని అధికారులు పేర్కొన్నారు. 2018,19 మధ్య కాలంలో ఉగ్రవాదులు ఈ యువతి ఇంట్లోనే చాలా సార్లు బస చేసినట్లు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు

Recent

- Advertisment -spot_img