Homeక్రైంవాచర్‌పై ఎలుగుబంటి దాడి

వాచర్‌పై ఎలుగుబంటి దాడి

ఇదేనిజం, ఏపీ బ్యూరో : ఫారెస్ట్‌ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో వాచరన తీవ్ర గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నెక్కంటి రేంజ్‌ పరిధిలో ఫారెస్ట్‌ ప్రొడక్షన్‌ వాచర్‌ చెవుల వెంకటేశం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. అయితే వెలగల పెంట సమీపంలో ఎలుగుబంటి దాడి చేసింది. దాంతో తీవ్ర గాయాలు అయిన వెంకటేశంను చికిత్స నిమిత్తం సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు ఫారెస్ట్‌ సిబ్బంది తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తామని సుండిపెంట ప్రభుత్వ వైద్య సిబ్బంది తెలిపారు.

Recent

- Advertisment -spot_img