టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది. ముంబై రంజీ ట్రోఫీ జట్టుకు కూడా దూరమయ్యాడు.అతడిని జట్టు నుంచి తొలగించడానికి సరైన కారణాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించనప్పటికీ.. ఫిట్‌నెస్, క్రమశిక్షణారాహిత్యమే ఔట్‌కి కారణమని తెలుస్తోంది. సంజయ్ పాటిల్ (ఛైర్మన్), రవి ఠాకూర్, జీతేంద్ర ఠాక్రే, కిరణ్ పొవార్, విక్రాంత్ యెలిగేటిలతో కూడిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సెలక్షన్ కమిటీ పృథ్వీ షాను రంజీ ట్రోఫీ నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.పృథ్వీ షా క్రమశిక్షణ రాహిత్యం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు పెద్ద తలనొప్పిగా మారిందని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది.నెట్ సెషన్స్‌కు పృథ్వీ షా తరచూ ఆలస్యంగా వస్తున్నాడని ఇటీవల టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.