Homeక్రైంమహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య

– గ్రీన్ ఫార్మా సిటీ సమీపంలో కాలిపోయిన స్థితిలో మృతదేహం
– రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘటన

ఇదే నిజం, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని గ్రీన్‌ ఫార్మాసిటీ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బుధవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ రామాంజనేయులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతురాలిని మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంతని యాదమ్మ(40)గా గుర్తించారు. యాదమ్మ ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడ సమీపంలో విద్యుత్‌ డీఈ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె పని ఉందని కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరింది. అనంతరం యాదమ్మ ఆచూకీ కనిపించలేదు.

Recent

- Advertisment -spot_img