పిల్లిని అపశకునంగా భావిస్తారు చాలామంది. కర్ణాటకలోని బెక్కళలే గ్రామవాసులకు మాత్రం పిల్లి శుభ శకునం. అందుకే గుడి కట్టి దానికి నిత్యం పూజలు చేస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో జాతరలూ నిర్వహిస్తుంటారు. బెక్కళలేలోని గ్రామ దేవత మంగమ్మ.. పిల్లి రూపంలో ఆ ఊళ్లోకి ప్రవేశించిందని స్థానికులు నమ్ముతున్నారు. అందుకే పిల్లిని బాధపెడితే అమ్మవారిని ఇబ్బంది పెట్టినట్టేనని భావించి వాటిని ఆదరించి ఆరాధిస్తున్నారట.