Homeహైదరాబాద్latest Newsప్రెగ్నెన్సీ కాకుండా కండోమ్ ప్లేస్‌లో జెల్

ప్రెగ్నెన్సీ కాకుండా కండోమ్ ప్లేస్‌లో జెల్

గర్భం నివారణ కోసం కండోమ్స్ మాత్రమే కాకుండా మరో విధానం అందుబాటులోకి రానుంది. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (NICHD) దీనిపై పరిశోధనలు చేసింది. జెల్ రూపంలో ఉండే ఓ క్రీమ్‌ను భుజాలపై రాసుకుంటే పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందట. ఈ మేరకు NES/T అనే జెల్‌పై చేసిన పరిశోధనలను వెల్లడించారు.

NES/T అంటే నెస్టోరోన్, టెస్టొస్టెరాన్ అనే రెండు ప్రధాన పదార్థాల కలయిక. గర్భం, ఇతర పునరుత్పత్తి విధులను నిర్వర్తించే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్​ సింథటిక్​ వెర్షనే ఈ నెస్టోరోన్​. ఈ ఔషధాన్ని పురుషులకు ఇచ్చినప్పుడు, వృషణాల్లో ఉన్న టెస్టోస్టిరాన్​ వంటి సంతానోత్పత్తి హార్మోన్ల లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. మహిళల్లో గర్భ కారక హార్మోన్ల నియంత్రణకు ఈ నెస్టోరోన్​ వంటి ఔషధాలను ఉపయోగిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img