Homeజిల్లా వార్తలుఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబురాలు

ఇదే నిజం, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్​లోని సెయింట్ జోసఫ్  పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు దనము ఉట్టిపడేలా పాఠశాల ఆవరణ ముంగిట  రంగు, రంగుల రంగవల్లులతో, భోగి మంటలు, గొబ్బిళ్లు, సంప్రదాయ దుస్తులతో  పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు సంక్రాంతి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ అన్నమ్మ, కరస్పాండెంట్ బాలా ట్రీజ, సిస్టర్ క్లారా , ఉపాధ్యాయులు హనుమకుమార్, శివకుమార్, కిరణ్, నాగార్జున, ఫహిమ, జానకి, నాగ శిరీష, శాంతి, మల్లీశ్వరి, ఫర్హీన్, బాలమణి, ప్రవీణ, సైదమ్మ, అస్మా, ఫర్హాన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img