Homeహైదరాబాద్latest Newsఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా "గో కాస్మో" ఆస్ట్రోనోమీ వేడుకలు

ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా “గో కాస్మో” ఆస్ట్రోనోమీ వేడుకలు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: ఆర్కిడ్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్ ఒక కే 12 ప్రీమియర్ చెయిన్ అని, హైదారాబాద్ లో “గో కాస్మో” యువర్ టికెట్ టు స్పేస్ లాంచ్ చేయడం గర్వించదగ్గ విషయం అని అన్నా మారియా నోరోన్హా అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ద ఆర్కిడ్స్ బాచుపల్లి క్యాంపస్ లో జరిగే ఈ కార్యక్రమంలో అన్ని వయసుల స్పేస్ ఎస్థుసియాస్టులను కాప్టివేట్ చేస్తామన్నారు. బెంగళూర్, ముంబై, పూనే లో ఊహించని విజయం సాధించింది అని, ఇందులో దాదాపు 15.000 మంది విద్యార్థులు పాల్గొని, అస్ట్రోనోమి పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని చాటుకున్నారన్నారు. అనంతరం బాచూపల్లి ప్రిన్సిపాల్ తబస్సుమ్ జైదీ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే అస్ట్రోనోమి అనేది దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమని, దీని పట్ల లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మూడు రోజుల పాటు జరిగే వేడుకలు 31 మే ప్రారంభమై జూన్ 2 వరకూ కొనసాగుతాయని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో విపి అకాడమిక్స్ స్టూడెంట్ వెల్ఫేర్ హర్షా గుప్తా, జోనల్ హెడ్ హైదారాబాద్ ఎస్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img