ఇదే నిజం,బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన టీఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దం శివప్రసాద్, పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ హాజి బాబా ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్‌లో పీజీ కళాశాల అవశ్యకత గురించి చర్చించారు. బెల్లంపల్లిలో పీజీ కళాశాలను ఏర్పాటు చేయించడంలో అధికార పార్టీ విద్యార్థి విభాగంగా తమ సహకారం ఉంటుందన్నారు. అదేవిధంగా కళాశాలకు అభివృద్ధిలో ఎన్‌ఎస్‌యూఐ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఇడిగిరాల అరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.