Homeహైదరాబాద్latest Newsవిద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలి

విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలి

ఇదే నిజం, జగిత్యాల జిల్లా ప్రతినిధి : విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని మంచి మార్గంలో నడవాలని జగిత్యాల జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ క్యాలెండర్‌ను జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి డా.బి.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ విద్యార్థులకు అన్ని రంగాల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నేటి సమాజంలో విద్యార్థులు, యువకులు మద్యం, మత్తుకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలన్నారు. అఖిల భారత విద్యార్థి సమైఖ్య విద్యార్థి ఉద్యమాలతో పాటు విద్యార్థులను చైతన్య పరిచే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. రాబోయే ఎస్సెస్సి బోర్డ్ పరీక్షలలో ప్రతి విద్యార్థి మంచి గ్రేడ్‌లు సాధించి తల్లిదండ్రులు, పాఠశాల , జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అక్రమ్ మాలిక్ ,పట్టణ అధ్యక్షుడు శివసాయిరెడ్డి, సంయుక్త కార్యదర్శి రాహుల్‌, కౌన్సిల్‌ సభ్యుడు నాగరాజు, ఓంకార్, అనిల్ , సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img