Homeహైదరాబాద్latest Newsఅద్దెకు గర్ల్‌ఫ్రెండ్..ఎక్కడంటే?

అద్దెకు గర్ల్‌ఫ్రెండ్..ఎక్కడంటే?

అద్దె ఇల్లు, అద్దె కారు గురించి అందరికీ తెలుసు. కానీ అది అద్దెకు గర్ల్ ఫ్రెండ్ అంటే కాస్త వెరైటీనే కదా. అలా గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు తీసుకునే వెబ్ సైట్ చైనాలో ఉంది. వెబ్‌సైట్ ద్వారా డబ్బు చెల్లించి స్నేహితురాలిని అద్దెకు తీసుకోవచ్చు. వీరితో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఏం చేయొచ్చో జాబితా ఉంది. వారు డేట్‌కి వెళ్లడం, రెస్టారెంట్‌కి వెళ్లడం, మాట్లాడటం, వీడియో గేమ్‌లు ఆడటం వంటి పనులు చేయగలరు. ప్రతీ దానికి ఓ ఖర్చు ఉంటుంది. మీరు డిన్నర్ డేట్‌కి వెళ్లి తిన్న తర్వాత బయలుదేరితే రెండు వేలతో విషయం తేల్చవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కావాలంటే చాలా నష్టపోతారు. ఉదాహరణకు ఫుట్ మసాజ్ చేయించుకోవచ్చు.. దీనికి ఖర్చు 6-7 వేలు కావచ్చు. చైనాలో అటువంటి అంశాలపై రూపొందించిన వెబ్‌సైట్‌లు కరోనా కాలానికి ముందు నుండి బాగా ప్రాచుర్యం పొందాయి. దీనితో శారీరక హింస వంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. వారు కూడా ఈ సేవలు అందించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Recent

- Advertisment -spot_img