– జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థిదని అనుమానం?
– కొనసాగుతున్న ప్రలోభాల పర్వం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పోలీసులు హైదరాబాద్లో భారీగా డబ్బు సీజ్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో ఈ నగదు సీజ్ చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న రూ. కోటి 68 లక్షల 80 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థిదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తర్వాత పోలీసులు డబ్బులు పంపకాలపై దృష్టి పెట్టారు. చాలా మంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఆయా పరిధిలో ఉన్న అభ్యర్ధులు భారీ స్థాయిలో డబ్బులు పంచుతున్న పరిస్థితి నెలకొంది.