Homeసినిమాఅట్లీ డైరెక్షన్​లో భారీ Multi Starrer

అట్లీ డైరెక్షన్​లో భారీ Multi Starrer

షారుఖ్​ ఖాన్​ నటించిన‘జవాన్‌’సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్​ కొట్టాడు డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం ఆయన తర్వాతి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అట్లీ ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్‌, షారుఖ్​తో కలిసి ఓ మల్టీ స్టారర్‌ తీసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు తెలిపిన అట్లీ.. త్వరలోనే ఇది తెరకెక్కే అవకాశాలున్నట్లు చెప్పారు. ‘ఇటీవల ఓ పార్టీలో విజయ్‌, షారుఖ్​ ఖాన్​ నా సినిమాల గురించి మాట్లాడుకొని నాకు ఫోన్‌ చేశారు. మల్టీస్టారర్‌ తీసే ఆలోచన ఉంటే.. అందులో తాను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుఖ్​ చెప్పారు. అలాగే విజయ్‌ కూడా ఇదే మాట అన్నారు. అందుకే వాళ్లిద్దరితో ఓ మల్టీస్టారర్ తీయాలని నిర్ణయించుకున్నా. ఇది నా తర్వాత సినిమాగానే రానుంది. రూ.3000 కోట్లు వసూళ్లు చేసే సినిమాగా నిలుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే నేను చెప్పలేను. ఈరోజు నేను ఈస్థాయిలో ఉండడానికి విజయ్‌ మొదటి కారణం. నాపై నమ్మకంతో అవకాశాలిచ్చారు’అని అట్లీ చెప్పారు.

Recent

- Advertisment -spot_img