Homeఫ్లాష్ ఫ్లాష్ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్య

ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్య

– ఆస్తి తగాదాలే కారణం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇచ్చోడకు చెందిన ఈశ్వర్‌ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. విచక్షణా రహితంగా కత్తులతో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఆస్తి తగాదాల వల్లే హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img