Homeహైదరాబాద్latest Newsబీసీల కుల గణన డిక్లరేషన్ కు వెంటనే ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని స్థానిక ఎమ్మార్వో కు...

బీసీల కుల గణన డిక్లరేషన్ కు వెంటనే ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని స్థానిక ఎమ్మార్వో కు మెమోరాండం అందజేత

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలో నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నాడు కామారెడ్డి ఎన్నికల సభలు ప్రకటించిన విధంగా బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర బీసీలు అందరికీ డిక్లరేషన్ ప్రకటించడంలో 22 శాతం నుండి 24 శాతం పెంచుతామని వాగ్దానం చేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికీ ఎప్పటి చిప్ప ఎనుగులులో ఉన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా బిసి డిక్లరేషన్ నివేదికను, రిజర్వేషన్ల ప్రక్రియను తయారుచేసి 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలని బిజెపి ఓబీసీ మోర్చా గూడూరు మండల కార్యవర్గం డిమాండ్ చేస్తుంది.

  1. ప్రభుత్వం సివిల్ కనెక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
  2. గొల్ల కురుమలకు మేము అధికారంలోకి రాగానే గొర్రెల పంపిణీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.
    3.చేతివృత్తుల కమ్మరి, కుమ్మరి, మేదరి, వడ్రంగి, నాయిని బ్రాహ్మణ తదితర కుల వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలి.
  3. ఓ బి సి కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
  4. ఓ బి సి కులాలకు గాను 500 కోట్లు బడ్జెట్ను కేటాయిస్తూ.. ప్రత్యేక చైర్మన్ లను ఏర్పాటు చేయాలి.
  5. ఓ బీ సీలకు ఫీజు రియంబర్స్ మెంట్ ను ఆరు నెలల్లో అమలు చేయాలి.
  6. మత్స్య కారులకు సకాలంలో చేపల బిడ్లు అందించాలని డిమాండ్ చేస్తూ..

గూడూరు స్థానిక తహసిల్దారు సంగు శ్వేతా కు మెమోరాండాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గుండెబోయిన మల్లేష్ యాదవ్, ఓబీసీ జిల్లా కమిటీ సభ్యుడు సంపంగి జంపయ్య, గూడూరు మండల ఓబీసీ కమిటీ సభ్యులు అడ్డూరి బ్రహ్మచారి, ముదురుకోళ్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img