Homeహైదరాబాద్latest Newsమద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రంగదామునిపల్లి గ్రామానికి చెందిన ఆడేపు వెంకటేశం సన్నాఫ్ రాజవీర్,50 సంవత్సరాలు,పద్మశాలి కులం అనునతడు మద్యానికి బానిసై పనికి వెళ్లకపోవడంతో అప్పులు ఎక్కువైనవి.తేది 23-05-2024 రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో వెంకటేశం మద్యం మత్తులో పురుగుల మందు తాగినాడు.అదే రోజు రాత్రి అతని కుటుంబ సభ్యులు గుర్తించడంతో అతని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినాడని అతని కుమారుడైన ఆడెపు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు.

Recent

- Advertisment -spot_img