Homeజిల్లా వార్తలుపీజీ కాలేజీ ఏర్పాటు చేయాలి

పీజీ కాలేజీ ఏర్పాటు చేయాలి

– సీనియర్‌ డిగ్రీ విద్యార్థులు విజ్ఞప్తి

ఇదే నిజం, బెల్లంపల్లి:బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కాలేజీ ఏర్పాటు చేయాలని సీనియర్‌ డిగ్రీ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టీఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డిగ్రీిలు పూర్తిచేసిన తమకు పీజీ చేసే అవకాశాన్ని కూడా స్థానికంగానే కల్పించాలని కోరారు. పీజీ కోర్సులు ప్రవేశపెడితే దాదాపు 800ల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. డిగ్రీ కళాశాలలో పీజీ ఎంకామ్‌, ఎంఏ కోర్సులను ప్రవేశపెట్టి పేదవిద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాల్ని, విన్నపాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img