ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకం ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కీటకం ధర రూ.75 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఉంటుందని అంటున్నారు. దీనిని స్టాగ్ బీటిల్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఈ కీటకం ఆకారం కూడా ఓ ప్రత్యేకమైన రూపంలో ఉంటుంది. దీన్ని ప్రధానంగా ఔషధ తయారీదారులు ఎక్కువగా వినియోగించడం వల్లే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇవి సాధారణంగా అడవుల్లో నేలపై కనిపిస్తుంటాయి.