Homeహైదరాబాద్latest Newsకాలనీ సమస్యలు తీర్చాలని కమీషనర్ కు వినతి

కాలనీ సమస్యలు తీర్చాలని కమీషనర్ కు వినతి

ఇదే నిజం, రాయికల్: రాయికల్ మున్సిపల్ పరిధిలోని 11వార్డు శ్రీనివాస్ సిటీ కేబుల్ పక్కన గల కాలనీలో సమస్యలు తీర్చాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ జగదీశ్వర్ గౌడ్ కు కాలనీ వాసులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్డు, త్రాగునీటి సమస్యలు ఉన్నాయని, గతంలో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని ఇప్పటికి సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు పేర్కొన్నారు. కాలనీకి వచ్చే దారిలో మోర శంకర్ అనే వ్యక్తి కాలనీ వాసుల వాహనాలు, అలాగే త్రాగునీటి ట్యాంకర్ రాకుండా అడ్డుకుంటున్నారని, అట్టి వ్యక్తిపై చర్య తీసుకోని కాలనీలో సమస్యలు త్వరితగతిన పరిష్కారించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గుండేటి ఆనందం, రాజవ్వ, అఖిల, రమేష్, వెంకటరమణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img