హైదరాబాద్ ఉప్పల్ లో బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి హరిత అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కనే ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకగా, చికిత్స నిమిత్తం రామంతాపూర్లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లగా హరిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.