Homeహైదరాబాద్latest Newsపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

*ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 2009-2011 లో సిఇసి విభాగంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల రోజుల్లోనీ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.తమకు విద్యనందించిన అధ్యాపకులను సన్మానించారు.వివిధ రంగాల్లో స్థిరపడిన తోటి విద్యార్థులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్ బాబు,అధ్యాపకులు నారాయణ,శ్రీధర్,గణపతి,వెంకట్,కొమరయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img