Homeహైదరాబాద్latest Newsఆత్మీయ సమ్మేళనానికి.. మధురమైన జ్ఞాపిక

ఆత్మీయ సమ్మేళనానికి.. మధురమైన జ్ఞాపిక

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: ఆత్మీయ సమ్మేళనం అంటే అందరు ఒకే దగ్గరగా చేరి ఆత్మీయంగా పలకరింపులు జరుగుతాయి, ఏర్పాట్లు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి, కానీ ఓ నలుగురు విద్యార్థులు మాత్రం నూతనంగా ఆలోచించారు. మెట్ పల్లి పట్టణానికి చెందిన శ్రీ శ్రీనివాస గురుకుల విద్యాలయం విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత కలుస్తున్న సందర్బంగా కొత్త తరహాలో ఫ్లెక్సీ చేయించారు. పదవ తరగతి హాల్ టికెట్ల ఫోటో లను సేకరించి ఫ్లెక్సీ తయారు చేయించి వేదిక వద్ద ఏర్పాటు చేశారు. దీంతో వచ్చిన స్నేహితులంతా తమ ఫోటోలను చూస్తూ.. ఉద్వేగాలకు లోనయ్యారు. చివరలో మై స్వీట్ మెమొరీస్ అంటూ ఉత్సాహంగా గడిపారు.

Recent

- Advertisment -spot_img