బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఐసీసీని శాసించే శక్తి బీసీసీఐకి ఉంది. అలాగే బీసీసీఐ ఆటగాళ్లకు మరియు కోచింగ్ సిబ్బందికి భారీ వేతనాలను అందిస్తుంది. అయిన టీమిండియా ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనపై విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపలేదు. బోర్డు వర్గాలను స్వయంగా సంప్రదించిన తర్వాత కూడా వారు భారత జట్టు కోచ్ పదవిని తిరస్కరిస్తున్నారు. భారత క్రికెట్ బోర్డు స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్ మరియు జస్టిన్ లాంగర్ కోసం ప్రయత్నించినప్పటికీ వారు ఆసక్తి చూపలేదు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించానని.. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేనని భావించానని అందుకే నిరాకరించానని పాంటింగ్ చెప్పాడు. ఫ్లెమింగ్ కూడా దాదాపు అదే కారణం చెప్పాడు.
అయితే ఆస్ట్రేలియా మాజీ కోచ్, ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పిన కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు లాంగర్ వివరణ టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జస్టిన్ లాంగర్.. టీమ్ ఇండియా కోచ్ స్థానం గురించి మాట్లాడాడు.. రేసు నుంచి నేను తప్పుకుంటున్నట్లు తెలిపారు. కేఎల్ రాహుల్ ఇచ్చిన సలహా కూడా తనను ప్రభావితం చేసిందని చెప్పాడు. టీమ్ ఇండియా కోచ్ పదవి అంటే ఒత్తిడితో పాటు రాజకీయాలు కూడా ఉంటాయని రాహుల్ తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నాడు. ఐపీఎల్ కంటే ఒత్తిడి, రాజకీయాలు వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటాయని రాహుల్ చెప్పారని లాంగర్ అన్నారు. భారత జట్టు కోచ్ మంచి జాబే, కానీ ఇప్పుడు నాకు అది సరైన సమయం కాదు” అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.