BREAKING : కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. రోహిణి అనే మహిళ కట్టుకున్న భర్తనే మట్టుబెట్టింది. ఈ దుర్ఘటన సుభాష్ నగర్లో చోటుచేసుకుంది. కట్టేసి కొట్టడంతో తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని చెప్పారు. రోహిణి karimnagar జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.