ఓ మహిళ తలకు చున్నీ చుట్టుకుని స్కూటీపై వెళ్తోంది. ఎండాకాలం కావడంతో ఇలా కట్టుకుందని అంతా అనుకున్నారు. అయితే సమీపానికి వెళ్లి చూసిన వారు అవాక్కయ్యారు. ఫోన్లో మాట్లాడుతున్న ఆమె.. అది కిందపడకుండా చున్నీ కట్టుకుంది. ఇలా స్కూటీపై వెళ్తూనే ఫోన్లో మాట్లాడుతోంది. హెల్మెట్ లేకపోవడంతో పాటూ ఇలా వెరైటీగా ఫోన్ మాట్లాడుతుండడం చూసి అంతా ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.