Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి ఆడుజీవితం మూవీ

ఓటీటీలోకి ఆడుజీవితం మూవీ

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మూవీ ఆడు జీవితం( ది గోట్‌లైఫ్‌) ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 30 కోట్లకు ఆడుజీవితం (ది గోట్ లైఫ్ ) డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఆడుజీవితం మూవీ ఓటీటీలో మే 10న రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్‌, ఓటీటీ మధ్య కనీసం నలభై రోజుల గ్యాప్ ఉండాలని ఇటీవల కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌, ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ నిర్ణయానికి కట్టుబడి నలభై రోజుల తర్వాత ఆడుజీవితం (ది గోట్ లైఫ్ ) సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో ఆడుజీవితం ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఈ మూవీ ది గోట్‌డేస్ అనే నవల ఆధారంగా యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు బ్లెస్లీ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. బ్లెస్లీ 2009లో ఈ మూవీని అనౌన్స్‌ చేశాడు. ఈ మూవీ ఎన్నో అడ్డంకులను దాటుకొని చివరకు 2024లో రిలీజైంది. ఈ మూవీలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది. హాలీవుడ్‌ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్‌ గోకుల్ కీలక పాత్రలు పోషించారు.

Recent

- Advertisment -spot_img