Homeజిల్లా వార్తలురామలింగేశ్వర స్వామి దేవాలయంలో గణపతికి అభిషేకం

రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గణపతికి అభిషేకం

ఇదే నిజం ,ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈరోజు అంగాకార సంకష్టహర చతుర్థి” సందర్భముగ అనుబంధ దేవాలయము అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గల గణపతికి గణపతి ఉపనిషత్లతో అభిషేకం, విశేషపూజలు హారతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగానిర్వహించబడినవి.ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్, స్థానిక వేదపండితులు మధు రామ శర్మ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ , రాజగోపాల్ ,అర్చకులు విశ్వనాథ శర్మ ,సాయికుమార్ , అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img