Homeహైదరాబాద్latest NewsAC vs Cooler : ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ బెటరా లేదా కూలర్...

AC vs Cooler : ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ బెటరా లేదా కూలర్ బెటరా..?

AC vs Cooler : ఎండాకాలం రానే వచ్చేసింది ఇకముంది ఎండలు కూడా మండిపోతున్నాయి. అయితే ఈ క్రమంలో జనాలు అందరూ ఏసీలు, కూలర్ లు వైపు చూస్తారు. ఈ నేపథ్యంలో వారందరికి ఒక సందేహం వస్తుంది. ఏసీ కొనాల లేదా కూలర్ కొనాల అని ఆలోచిస్తారు. అలాగే ఈ రెండిట్లో ఏది బెటర్ అని కూడా చూస్తారు. అయితే చాలా మంది జనాలు ఏసీలనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఏసీల కంటే కూలర్లు మంచి కూలింగ్ ఇస్తాయని, ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏసీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.

క్వాలిటీ : ఏసీల నుంచి వస్తున్న గాలి ఒక ఒకే గాలిని పీల్చుకుని అదే గాలిని బయటకు వదులుతుంది. ఇలాంటి గాలి పొడిగా మారుతుంది. కూలర్ మాత్రం బయటి గాలిని పీల్చుకుని చల్లబరుస్తుంది మరియు అదే గాలిని విడుదల చేస్తుంది. కూలర్ నుండి వచ్చే గాలి కూడా చాలా తేమగా ఉంటుంది. అందుకే కూలర్లు ACల కంటే మెరుగైన గాలిని ఇస్తాయి. కూలర్ గాలి 100 శాతం నాణ్యతతో ఉంటుందని చెప్పవచ్చు.

ఆరోగ్య సమస్యలు : కూలర్‌లోని గాలి సహజమైనది. ACలోని గాలి చల్లగా ఉన్నప్పటికీ, రసాయనాలను పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ధర : ఈ రెండిటి ధరలు పోలిస్తే కూలర్లు కంటే ఏసీల ధర ఎక్కువ.. ఏసీలు ధరలు రూ. 30 వేల నుంచి రూ.70 వేలు ఉంటుంది. అయితే కూలర్లు ధర రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఈ కూలర్లు సగటు మధ్యతరగతికి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

Recent

- Advertisment -spot_img