నల్గొండ, మహబూబాబాద్, టోలిచౌకి, అశ్వరావుపేట, సిద్దిపేట తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏజెంట్ల వద్ద ఉన్న సొమ్మును పట్టుకుంటున్నారు. అనధికారికంగా విధుల్లో ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. పలుచోట్ల దరఖాస్తుదారులకు అందించే సేవలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ ఆర్టీవో గౌష్ పాశాను అదుపులోకి తీసుకున్నారు.