తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీవో ఆఫీసుల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. పెద్దయెత్తున అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్తాపూర్, మణికొండ ఆర్టీవో కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. వాహనాలకు పర్మిట్, లైసెన్సుల జారీ, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వంటి వాటిల్లో భారీగా అవినీతి జరినట్లు తెలుస్తోంది. కాగా జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనుండటంతో బస్సులు ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్దయెత్తున అక్రమాలు జరిగే అవకాశం ఉందని భావించిన ఏసీబీ దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.