Homeజిల్లా వార్తలుగ్రామస్థాయి కార్యక్రమములో దరఖాస్తుల స్వీకరణ

గ్రామస్థాయి కార్యక్రమములో దరఖాస్తుల స్వీకరణ

ఇదే నిజం, దేవరకొండ: కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో గల ధోనియాల గ్రామపంచాయతీలో ఈరోజు గురువారం నాడు ప్రజావాణి కార్యక్రమము పంచాయతీ సెక్రెటరీ రావుల కోటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణి వలన ప్రజలకు సమస్యలను తీరుతాయని, అలాగే ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి కూడా ప్రజలు తెలుసుకునే విధంగా గ్రామపంచాయతీలోనే అన్ని సమస్యలు చెప్పుకునే విధంగా జరుగుతుందని తెలియజేశారు. తరువాత పాఠశాలను సందర్శించి శుభ్రంగా ఉంచుకొని పాఠశాల చుట్టూ ముక్కలు నాటాలని తెలియజేశారు. కార్యక్రమంలో వృద్ధాప్య పింఛన్ సంబంధించిన దరఖాస్తునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.కె అబ్బని పాషా, స్కూల్ హెడ్మాస్టర్ ఏ.శ్రీను, గోపాలమిత్ర భూతరాజు సైదులు, అంగన్వాడి టీచర్ కళ్ళు, బుచ్చమ్మ, ఆశా వర్కర్ మేదరి.కాంతమ్మ, వివో ఏ కె. కృష్ణ కళ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img