Homeజిల్లా వార్తలుములుగు జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ..

ములుగు జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ..

ఇదేనిజం, ములుగు: ములుగు జిల్లాలో ఆరు గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం, ములుగు జిల్లాలోని కంతనపల్లి, చింతగూడెం గ్రామాల్లో జడ్పీటీసీ చందుగాంధీ అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా చందుగాంధీ మాట్లాడుతూ.. ప్రజపాలన గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ను ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారునికి 4 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించాలని ఆయన చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అధికారుల పాత్ర కీలకమైందని అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ఎమ్మార్వో, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img