Homeహైదరాబాద్latest Newsజబర్దస్త్ కమెడియన్‌కు యాక్సిడెంట్..సేఫ్

జబర్దస్త్ కమెడియన్‌కు యాక్సిడెంట్..సేఫ్

జబర్దస్త్ కమెడియన్‌ పవిత్రకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సొంతూళ్లో ఓటు వేసేందుకు వెళుతుండగా తన కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ నెల 11న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వల్ప గాయాలతో పవిత్ర బయటపడింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ముందు టైర్ ఊడిపడిపోవడంతో పాటు పలు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన తీరును గుర్తుచేసుకుంటూ.. ప్రాణాలతో బయటపడతాననే నమ్మకం కలగలేదని పవిత్ర ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.

Recent

- Advertisment -spot_img