Homeతెలంగాణ#THR #HarishRao : మంత్రి హరీష్ రావు కాన్వాయికి ప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

#THR #HarishRao : మంత్రి హరీష్ రావు కాన్వాయికి ప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

సిద్దిపేటలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌, ఇత‌ర అభివృద్ది ప‌నుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా మంత్రి హ‌రీష్ రావు కాన్వాయ్ ప్ర‌మాదానికి గుర‌యింది.

కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డు రావ‌డంలో డ్రైవ‌ర్‌ సడెన్ గా బ్రేక్ వేయాల్సివ‌చ్చింది.

ఆ కారుకు వెనుకనే వ‌స్తున్న మంత్రి కూర్చున్న వాహ‌నం ముందు వాహ‌నాన్ని డీకొట్టింది.

దీంతో కారులోని సిబ్బందిలోని ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.

గాయాపాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరోకారులో హైద్రాబాద్ వెళ్లారు మంత్రి హరీష్ రావు.

ఈ ప్ర‌మాదంలో కారు ముందు భాగం కొంత ధ్వంసం అయింది. కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ప్ర‌మాదం జ‌రిగింది.

Recent

- Advertisment -spot_img