Homeజిల్లా వార్తలుగుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కుంభం నరేష్

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కుంభం నరేష్

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో విధికో పాఠశాల పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న గుర్తింపు లేని ప్రవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కుంభం నరేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలలోని గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లితండ్రులను మోసం చేస్తూ జేబులకు చిల్లులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాలలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారని అన్నారు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలను కాపాడాలని విద్యాశాఖ అధికారును కోరారు. లేనియోడల ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సంఘం నాయకులు భూతరాజు అనిల్, సురేష్, శివ, హరికృష్ణ, ముత్యాలు, బాలకృష్ణ, అజయ్, అరవింద్ తదితరులు.

Recent

- Advertisment -spot_img