Homeహైదరాబాద్latest Newsఇండియా లెవెల్లో "మా" పరువును మంటగలిపిన హేమ కి మళ్ళీ "మా" సభ్యత్వం కావాలట..!

ఇండియా లెవెల్లో “మా” పరువును మంటగలిపిన హేమ కి మళ్ళీ “మా” సభ్యత్వం కావాలట..!

బెంగుళూరులో రేవ్ పార్టీ కేసులో బెయిల్‌పై నటి హేమ విడుదలైన విషయం తెలిసిందే. హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో ఉండటంతో ఈ విషయంపై ఆమెను అసోసియేషన్ లో సస్పెన్షన్ విధించారు. తాజాగా హేమ దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణుని కలిసింది. మంచు విష్ణుకి ఒక లేఖ రాసింది. అలాగే తాను స్వయంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ మంచు విష్ణుకి అందించింది. రేవ్ పార్టీ డ్రగ్ కేసులో అరెస్టయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులకు ప్రాతినిధ్యం వహిస్తున్న MAA, హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. MAA తన పక్షాన వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా లేదా షోకాజ్ నోటీసు జారీ చేయకుండానే తొందరపడి నిర్ణయం తీసుకుందని హేమ అప్పుడు వాదించారు.
ఇప్పుడు కేసు నుండి క్లియర్ అయిన హేమ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని MAAని అభ్యర్థించింది. డ్రగ్స్ వాడిన మరియు విక్రయించే రేవ్ పార్టీలను నిర్వహించినందుకు బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆమె కూడా ఉంది. ఇదే విషయమై హేమ మంచు విష్ణుకు విజ్ఞప్తి చేసి వ్యక్తిగతంగా కలిశారు. అయితే మళ్ళీ హేమ “మా” సభ్యత్వం కావాలంటూ విష్ణుని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇండియా లెవెల్లో మా పరువును మొత్తం మంటగలిపి హేమ కి “మా” సభ్యత్వం ఎందుకంటూ విమర్శలు వస్తున్నాయి. “మా” నుండి గేంటివేయబడిన హేమ మళ్ళీ సభ్యత్వం కావాలంటూ ఏ మొఖం పెట్టుకొని ఆడుతుందని అంటున్నారు. రేవ్ పార్టీ పట్టుబడటం కన్నా అందులో లేనంటూ ఆమె చేసిన డ్రామా అంతా ఇంత కాదు. తెలుగు సినిమా నటినటుల పరువు మొత్తం హేమ తీసేసింది. ఇప్పుడు మా సభ్యత్వం కావాలంటూ అడగడం ఏంటంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై విష్ణు కానీ, అసోసియేషన్ కానీ నోరువిప్పలేదు.

Recent

- Advertisment -spot_img