Homeసినిమానటుడు విజయకాంత్​కు గొంతు ఇన్ఫెక్షన్

నటుడు విజయకాంత్​కు గొంతు ఇన్ఫెక్షన్

– చెన్నైలోని ఆస్పత్రిలో అడ్మిట్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్‌ కారణంగా శనివారం ఆయన చెన్నై పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. రెగ్యులర్‌ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని.. త్వరలోనే ఇంటికి చేరుకుంటారని డీఎండీకే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, గతకొంతకాలంగా విజయ్‌కాంత్‌ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ కారణంగానే ఆయన కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయలేదు. విజయ్‌కాంత్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో ఆయన భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై పార్టీ చర్చలు జరుపుతున్నది. ఈ సమయంలోనే విజయ్‌కాంత్‌ ఆసుపత్రిలో చేరారు.

Recent

- Advertisment -spot_img