Vishal Injured: షూటింగ్లో స్టార్ హీరోకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు!
Vishal Injured: యాక్షన్, స్టంట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి.
నటులు గాయపడుతుంటారు. అయితే డూప్ లేకుండా ఇలాంటి సన్నివేశాల కోసం రిస్క్ చేసే హీరోల్లో విశాల్ ఒకరు.
ఎందుకంటే యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్లో విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.
అయితే పోరాట సన్నివేశాల్లో రియల్ స్టంట్లు చేస్తూ ఇప్పటికే పలుసార్లు గాయపడిన ఆయన.. తాజాగా మరోసారి తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది.
గతంతో పోలిస్తే ఈ సారి మరింత ఎక్కువగా దెబ్బలు తగిలాయని సమాచారం.
ప్రస్తతం విశాల్ నటిస్తున్న చిత్రం ‘లాఠీ’. ఈ మూవీ క్లైమాక్స్ భాగాన్ని రాత్రిపూట తెరకెక్కిస్తుండగా.. ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో విశాల్ కాలికి బాగా దెబ్బలు తగిలినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి.. వెంటనే చికిత్స కోసం ఆయన కేరళ వెళ్లారట.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్ షాట్లు చేయొద్దని కోరుతున్నారు.
అంతకుముందు హైదరాబాద్‌లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలోనూ విశాల్‌కు గాయాలు అయ్యాయి. అప్పుడూ షూటింగ్ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు.
ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ‘లాఠీ’ తెరకెక్కుతోంది.
రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సనయన కథా నాయిక.
ఇందులో విశాల్ ఓ శక్తిమంతమైన పోలీస్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది.
ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ పోరాట ఘట్టాలకు దిలీప్ సుబ్బరాయణ్ నేతృత్వం వహించారు.
మరి విశాల్ తన లాఠీతో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికాడో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.
ఇక ఈ చిత్రానికి సంగీతం- సామ్ సిఎస్, ఛాయాగ్రహణం- బాలసుబ్రమణ్యన్ అందిస్తున్నారు.