ఇదేనిజం, హైదరాబాద్: సిక్కిం వరదల్లో అలనాటి నటి సరళాకుమారి గల్లంతయ్యారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే ఇటీవల తన స్నేహితురాళ్లతో కలిసి అక్టోబర్ 2న సిక్కిం వెళ్లారు. కాగా తాజాగా ఆమె సిక్కిం వరదల్లో గల్లంతయ్యారు. ఈ విషయమై ఆమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తెకు కూడా సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉన్న హోటల్లో వారు బస చేసినట్లు తెలిసింది. సిక్కింలో వచ్చిన ఆకస్మిక వరదల తర్వాత సరళాకుమారి ఆచూకీ గల్లైంతైంది. తల్లి ఆచూకీ తెలియకపోవడంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఆచూకీ కనిపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.
Actress Gallanthu of yesteryear in the floods of Sikkim సిక్కిం వరదల్లో అలనాటి నటి గల్లంతు
RELATED ARTICLES