Homeహైదరాబాద్latest Newsపవన్ స్పీచ్ అంటే ఎంతో ఇష్టం : లయ

పవన్ స్పీచ్ అంటే ఎంతో ఇష్టం : లయ

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి ఓ ఇంటర్వ్యూలో నటి లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కల్యాణ్ స్పీచ్‌లంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ‘రాజకీయ నాయకులు ఇచ్చే స్పీచ్ లు కొంచెం టిపికల్ గా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ లు అలాగా ఉండవు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మా యాక్టర్స్ రోజా లాంటి వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ లా మాట్లాడుతుంటారు. కానీ పవన్ మాత్రం అలా కాకుండా.. నిజాయితీగా, తనకి అనిపించింది మాట్లాడతారు. ఒకర్ని ఆకట్టుకోవాలని ఎప్పుడు మాట్లాడరు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్న లయ మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వనుంది. ఇప్పటికే ఒకటి, రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img