Homeహైదరాబాద్latest Newsఅనుమానాస్పద స్థితిలో బాలీవుడ్ నటి మృతి - Actress Noor Malabika Das Suspicious Death

అనుమానాస్పద స్థితిలో బాలీవుడ్ నటి మృతి – Actress Noor Malabika Das Suspicious Death

Actress Noor Malabika Das

బాలీవుడ్ నటి నూర్​ మాలాబికా దాస్ (37) అనుమానాస్పదంగా మృతి చెందింది. ముంబయిలోని తన ఫ్లాట్​లో విగతజీవిగా కనిపించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నూర్​ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. నూర్ స్వస్తలం అసోం. స్థానికుల కథనం ప్రకారం.. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఎవరూ తీసుకెళ్లేందుకు రాలేదు. అంధేరిలో ఉన్న నూర్​ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఫ్లాట్‌కు చేరుకొని తలుపును తెరిచారు. ఆ సమయంలో నూర్​ మృతదేహం కుళ్లిపోయిన దశలో కనిపించింది. పోస్టుమార్టం కోసం డెడ్​బాడీని ఆసుపత్రికి తరలించారు.

కాగా, 2023లో రిలీజైన లీగల్​ డ్రామా ‘ది ట్రైల్​’ వెబ్​ సిరీస్​లో నటి కాజోల్​తో కలిసి నూర్ నటించారు. సిస్కియాన్​, టీకీ చట్నీ, వాల్క్​మన్​, చరమ్​సుఖ్​ సహా పలు హిందీ సినిమాలు, వెబ్​ సిరీస్​లలోనూ నటించారు నూర్. అయితే ఇప్పుడు ఆమె మరణవార్త అందరినీ షాక్​కు గురి చేస్తోంది.

Recent

- Advertisment -spot_img