బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలపై అరెస్టైన నటి సంజన వైద్య పరీక్షలకు ఏమాత్రం సహకరించడం లేదు. సంజనకు డోప్ పరీక్షలు చేయించేందుకు బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు బెంగళూరులోని గల్రానీ ఆస్పత్రి తీసుకెళ్లారు. అక్కడ ఆమె నానా హంగామా చేశారు. డోప్ పరీక్ష చేయించుకోనంటూ వైద్యులకు సహకరించకుండా, పోలీసులతో వాదనకు దిగారు. ‘నన్నెందుకు అరెస్టు చేశారు? మీరంతా కలిసి నన్ను బకరాను చేశారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. నన్నెందుకు అరెస్టు చేశారనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు’ అని కేకలు పెట్టారు. మరోపక్క ఈ కేసు విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బెంగళూరు చేరుకున్నారు. సీసీబీ కస్టడీలో ఉన్న రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీ, పృథ్వీ శెట్టితో పాటు మాదకద్రవ్య సరఫరాదారులు వీరేన్ ఖన్నా, రాహుల్‌లను విచారించేందుకు కోర్టు నుంచి ఇప్పటికే అనుమతి పొందారు.
‘నన్ను బకరాని చేశారంటూ’ రచ్చ.. రచ్చ చేసిన సంజనా
RELATED ARTICLES