Homeఫ్లాష్ ఫ్లాష్adipurush ott: ఓటీటీలోకి ఆదిపురుష్​.. స్ట్రీమింగ్​ ఎక్కడంటే..

adipurush ott: ఓటీటీలోకి ఆదిపురుష్​.. స్ట్రీమింగ్​ ఎక్కడంటే..

adipurush ott: రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్​ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతోంది. ప్రభాస్, కృతి సనన్​ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్​ లో పెద్దగా ఆడలేదు. ఇక ప్రభాస్​ ఫ్యాన్స్​ కూడా తీవ్రంగా నిరుత్సాహ పడ్డారు. ఈ సినిమాలోని డైలాగ్స్​, కథ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నా.. మూవీ రిలీజ్​ అయ్యాక పెద్దగా సక్సెస్​ కాలేదు. రామయణ కథను, పాత్రలను తప్పుగా చిత్రీకరించారన్న విమర్శలు వచ్చాయి.

కాగా తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ స్ట్రీమింగ్​ అవుతోంది. ఈ మూవీలోని గ్రాఫిక్స్​ మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి ఆదిపురుష్​ మూవీ కనీసం ఓటీటీ ప్రేక్షకులనైనా ఆకట్టుకుంటుందా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img