HomeతెలంగాణCM KCR : ప‌రిపాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు క‌మిటీ

CM KCR : ప‌రిపాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు క‌మిటీ

CM KCR : ప‌రిపాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు క‌మిటీ

CM KCR : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రెటరీ స్మితా సబర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Tesla in India : టెస్లాకు మరిన్ని రాష్ట్రాలు స్వాగ‌తం

Pigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బ‌హుమ‌తిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..

ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలలో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాలలో చేరిపోయారని అధికారులు సీఎంకు వివరించారు.

ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, ఇంకా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని సీఎం ఈ కమిటీకి సూచించారు.

Fixed Deposit : ఎఫ్‌డీపై వ‌డ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ

BSNL Prepaid Plans : హైస్పీడ్ డేటాతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్‌

ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయేశాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఇంకా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం, కొత్తగా సాంకేతికంగా ఏమిమి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం కమిటీని ఆదేశించారు.

వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమస్థానంలో నిలిచిందని, ఇంకా మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

China : చైనాలో జనాభా సంక్షోభం.. పుట్టుక‌లు త‌క్కువ‌.. ముస‌లోళ్ళు ఎక్కువ‌

Afghanistan Poverty : ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం

ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో తగు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఈ కమిటీకి సూచించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎంవో అధికారులు శేషాద్రి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

LIC IPO : త్వ‌ర‌లో ఐపీవోలోకి ఎల్‌ఐసీ

Jujube : ఈ సీజ‌న్‌లో దొరికే రేగుపండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Recent

- Advertisment -spot_img