కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. తమ అభిమానులు ఎవరు కలత చెందాల్సిన అవసరం లేదని.. అందరం కలిసి ప్రజాపాలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు
తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. అయితే అద్దంకికి పార్టీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. చివరి నిమిషంలో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించింది. రేపు ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. ఈ 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ALSO READ: CM రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. దేని గురించి అంటే..?