HomeతెలంగాణAE: ఏఈలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు.

AE: ఏఈలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు.


AE: ఏఈలకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీర్స్ స్పష్టం చేసింది. శనివారం ఎల్బీ నగర్ లోని ఓ హోటల్ లో జరిగిన సమావేశానికి తెలంగాణలోని R&B, I&Cad, MA&Ud, PR, RWS శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు. కౌన్సిల్ చైర్మన్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను సభ్యులు తీర్మానించారు. ఒకే రకమైన విధులు నిర్వర్తించే ఏఈ, ఏఈఈ కేడర్ పోస్టులను ఒకే నోటిఫికేషన్ తో 3:1 ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా AEలను ఏఈఈలుగా మార్చడం సరికాదన్నారు. ఇక ఏఈలకు సర్వీస్ రూల్స్ ప్రకారం డిఈఈ ప్రమోషన్ ఇవ్వకుండా కొర్రీలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. సర్వీస్ రూల్స్ కి సంబంధించి విడుదల చేసే జీవోలను ఖచ్చితంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి వర్తింపజేయాలని, కానీ సర్వీస్ లో ఉన్నవారిని నూతన నిబంధనల పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. ఎప్పటి నుంచో ఉన్నా సర్వీస్ నిబంధనలను ఏఈఈలకు అనుకూలంగా మార్చడంతో ఏఈలకు తీరని అన్యాయం జరుగుతోందని కౌన్సిల్ సమావేశంలో కార్యవర్గ సభ్యులు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కో ఛైర్మన్లు పాండు రంగారెడ్డి, ఎం ఏ రహీం, కన్వీనర్ ఇంద్రాసేనా రెడ్డి, సెక్రటరీ జనరల్ కిరణ్ కుమార్, అన్ని జిల్లాలకు చెందిన ఇంజనీర్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img