Homeఅంతర్జాతీయంAfghanistan Minister now Pizza delivery boy : నిన్నటి వరకు మంత్రి.. ఇక నేటి...

Afghanistan Minister now Pizza delivery boy : నిన్నటి వరకు మంత్రి.. ఇక నేటి నుంచి పిజ్జా డెలివరీ బాయ్‌

నిన్నటివరకు ఒక దేశంలో మంత్రిగా ఉండి ప్రణాళికలు అమలయ్యేలా చూసిన ఓ వ్యక్తి.. కాలక్రమంలో బతుకుదెరువు కోసం మరో దేశంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా (Afghanistan IT Minister) పనిచేయాల్సి వస్తున్నది.

తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పిజ్జాలు డెలివరీ చేస్తున్న ఈయన మరెవరో కాదు.. ఆఫ్ఘనిస్తాన్‌ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌.

జర్మన్‌ నగరమైన లీప్‌జిగ్‌లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఈయన.. పిజ్జా కంపెనీ యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్‌ వశం కాగానే ఆ దేశాధ్యక్షుడితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర దేశాలకు వలస వెళ్లారు.

అక్కడి ఐటీ శాఖ మంత్రి అయిన సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌ కూడా కుటుంబసమేతంగా జర్మనీకి వెళ్లారు.

అక్కడ లీప్‌జిగ్‌ నగరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సాదత్‌.. కుటుంబపోషణ కోసం పిజ్జాలు అందించే ఉద్యోగాన్ని ఎంచుకున్నారు.

ఎలాంటి బేషజాలు లేకుండా పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్‌లో మొబైల్ ఫోన్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా తీసుకువచ్చిన మంత్రిగా దేశవ్యాప్తంగా సాదత్‌ అభినందనలు అందుకున్నారు.

ఇలాఉండగా, గత ప్రభుత్వంతో పొసగని కారణంగా కొంతకాలం క్రితమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అల్‌జజీరా ట్విట్టర్‌ ద్వారా నివేదించింది.

కొద్దిరోజుల పాటు అక్కడే ఉన్న సాదత్‌.. ఆఫ్ఘాన్‌ను తాలిబాన్‌ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి వారం ముందు జర్మనీకి వలసవెళ్లినట్లు పేర్కొన్నది.

చేతిలో సరిపోయేంత డబ్బు లేకపోవడంతో పిజ్జాలు డెలివరీ చేసే పనిని ఎంచుకున్నానని, ఈ పని చేయడం వల్ల తానేమీ ఫీలవడం లేదని సాదత్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img