Homeజిల్లా వార్తలుతాగునీటికి తండావాసుల అగచాట్లు

తాగునీటికి తండావాసుల అగచాట్లు

– పట్టించుకోని పంచాయతీ పాలకవర్గం

ఇదే నిజం,వరంగల్‌ ప్రతినిధి: కొరవి మండలం బలుపాల లింగ్యతండాలో తాగునీటి కోసం తండావాసులు నానా అగచాట్లు పడుతున్నారు. పది రోజులుగా నల్లాల బావిమోటార్‌ కాలిపోయి నల్లాలు రాకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్‌ రిపేర్‌ చేయించి తాగునీటి సరఫరా చేయాల్సిన పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి గాని పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు సోషల్‌ మీడియాలో వాపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. నల్లానీరు కోసం గ్రామస్థులు సర్పంచును అడగగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు కదా ఇంక మీరే నల్లాలు వేసుకోండి, అన్ని వ్యవహారాలు మీరే నడుపుకోండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వాపోతున్నారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే రాజకీయాలతో ముడిపెట్టి ఇబ్బందిపెట్టడం సరికాదని మండలంలో చర్చనీయంశంగా మారుతుంది. అధికారులు స్పందించి తక్షణం గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని పలువురు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img