Homeహైదరాబాద్latest Newsఅర్హులైన ప్రతి రైతుకు బ్యాంకులో ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి

అర్హులైన ప్రతి రైతుకు బ్యాంకులో ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి

ఇదే నిజం, దేవరకొండ: డిండి మండలంలోని బావుండ్ల పళ్లి గ్రామంలో నిర్వహించిన సిపిఐ గ్రామ శాఖ నిర్మాణ సమావేశానికి సభాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి గారు,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మైనొద్దీన్ పాల్గొని మాట్లాడుతూ గ్రామ శాఖలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని సమస్యలు ఏమన్నా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వార్డు నుండి మొదలు పెడితే సర్పంచిగా పోటీ చేసే విధంగా అందరూ సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి 09-12-2023 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న అర్హులైన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల పూర్తి రుణమాఫీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.నూతనంగా గ్రామశాఖ సిపిఐ కార్యదర్శిగా ఏటెల్లి వెంకటయ్య ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img