Homeహైదరాబాద్latest Newsగ్రాండ్ గా రాబోతున్న అఖిల్ ..ఈ సారైనా హిట్ కొడతాడా..?

గ్రాండ్ గా రాబోతున్న అఖిల్ ..ఈ సారైనా హిట్ కొడతాడా..?

అక్కినేని వారసుడు అఖిల్ ఏం చేస్తున్నాడు .. ఏజెంట్ మూవీ డిజాస్టర్ తరువాత కనిపించలేదు. అప్పుడు అప్పుడు బయిటకు వచ్చి బాడీ బిల్డింగ్ ..మరి గుంపురు గడ్డం తో డిఫరెంట్ గా కనిపించాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అదే సంస్థలో పని చేసిన అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ గ్రాండియర్ ని ప్లాన్ చేశారు. దీని కోసమే ప్రత్యేకంగా జుత్తు, గెడ్డం విపరీతంగా పెంచేసిన అఖిల్ ఈసారి ఎలాగైనా సరే గురి తప్పకూడదనే సంకల్పంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీలో అఖిల్ పదకొండో శతాబ్దానికి చెందిన ఒక అటవీ వీరుడిగా కనిపిస్తాడని సమాచారం. అంటే మొత్తం అడవి బ్యాక్ డ్రాపన్నమాట. అపకలిప్టో తరహాలో మొత్తం వేరే ప్రపంచంలో కథ సాగుతుందని తెలిసింది.షూటింగ్ మొదలుపెట్టడంలో కొంత ఆలస్యం జరిగినా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా యువి మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img